- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లిలో మండపల్లి భూమేశ్ (34) దారుణ హత్యకు గురయ్యాడు. సంపాదించిన డబ్బులను కుటుంబ అవసరాలకు ఇవ్వడం లేదనే కోపంతో భార్య విజయ, అత్త లక్ష్మితో కలిసి భూమేశ్‌ను ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో మెడకు చున్నీతో ఉరి వేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం సంఘటనా స్థలంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



