- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పిన భర్తను భార్యనే గొంతు నులిమి హత్య చేసిన ఘటన నారాయణపేటలో వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య చేసిన ప్రయత్నం చివరకు విఫలమైంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల అనుమానంతో అన్ని నిజాలు బయటపడ్డాయి. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32), మహబూబ్‌నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లికి చెందిన రాధను 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. జీవనోపాధి కోసం ఇటీవలే ఇద్దరూ ముంబైకి వలస వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ మణికొండ, నిజాంపేట్ ప్రాంతాల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
- Advertisement -