Thursday, July 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్-భార‌త్ మ‌ధ్య డీల్ కుదిరేనా..?

యూఎస్-భార‌త్ మ‌ధ్య డీల్ కుదిరేనా..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ట్రంప్ 2.0లో ప్ర‌తీకార సుంకాలతో ట్రేడ్ వార్ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. భార‌త్ తోపాటు ప్ర‌పంచ‌దేశాలపై భారీ స్థాయిలో సుంకాల‌తో మోత మోగించారు. ఆ త‌ర్వాత టారిప్‌ల అమ‌లుపై 90 రోజుల వాయిదా పేరుతో ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. ఈ లోపు యూఎస్‌తో ఆయా దేశాలు ఒప్పందాలు చేసుకోవాల‌ని ట్రంప్ హుకుం జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో భార‌త్ ప్ర‌భుత్వం వాషింగ్ట్‌న్ వేదిక‌గా అమెరికా వాణిజ్యం విభాగం అధికారుల‌తో ప‌లు రోజులుగా సుదీర్ఘ చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా కాసేప‌ట్లో భార‌త్-యూఎస్ వాణిజ్యం ఒప్పందంపై కొలిక్కి రానున్నాయ‌ని స‌మాచారం అందుతుంది. మ‌రోవైపు ఇక సుంకాలపై ట్రంప్ విధించిన తాత్కాలిక వాయిదా గడువు జూలై 9తో ముగుస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా భారత్‌తో భారీ ఒప్పందం జరగబోతుందని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

కాగా, ఒకవేళ కుదరకపోతే మాత్రం పరస్పర సుంకాల రేటు 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. అమెరికా ప్రతిపాదనలు.. భారతీయ రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు భారత్ అంగీకరించడం లేదని సమాచారం. వ్యవసాయం, పాడి రంగాలకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అదే జరిగితే గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రతపై భయాందోళనలు తల్తెతే అవకాశం ఉంది. భారత్ అందుకు అంగీకరిచడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా ముగుస్తాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -