Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెండు దశాబ్దాల కల.. నెరవేరేనా..?

రెండు దశాబ్దాల కల.. నెరవేరేనా..?

- Advertisement -

– హైకోర్టు ఆదేశం ప్రభుత్వం అమలు చేసేనా..!
– ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని
653 మంది ఉపాధ్యాయులకు  మేలు జరిగేనా!
– పాత పెన్షన్ పోరాట సమితి కామారెడ్డి  జిల్లా అధ్యక్షులు కొక్కుల శ్రీకాంత్
నవతెలంగాణ –  కామారెడ్డి

2003 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన  ఉపాద్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులెనని వారికి పాత పెన్షన్ పథకాన్ని  అమలుచేయాలని ఇటీవల తెలంగాణ హై కోర్ట్ జడ్జెమెంట్ జారీ చేసిందనీ దీనిని ప్రభుత్వం అమలు చేస్తే తమ రెండు దశాబ్దాల కళ నిలవేరినట్లేనని డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి కామారెడ్డి  జిల్లా అధ్యక్షులు కొక్కుల శ్రీకాంత్ తెలిపారు.  డీఎస్సీ 2003 నోటిఫికేషన్  ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ కి అర్హులేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో శనివారం వశిష్ట డిగ్రీ కాలేజ్ అవరణలో డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి కామారెడ్డి  జిల్లా అధ్యక్షులు కొక్కుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 డీఎస్సీ ఉపాద్యాయుల నియామకం కోసం అప్పటి  ప్రభుత్వం నవంబర్ 13, 2003 న నోటిఫికేషన్  జారీ చేసిందనీ,  ఏప్రిల్ 2004 లో రాత పరీక్షలు నిర్వహించి, జూన్ లో ఫలితాలు విడుదల చేసి నవంబర్ 2005 లో నియామకాలు చేశారన్నారు. కేవలం పరిపాలనాపరమైన కారణాలతో నియామక ఉత్తర్వులు ఆలస్యంగా జారీచేశారు. అలాంటప్పుడు వీరికి సెప్టెంబర్ 2004లో  వచ్చిన నూతన పించన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.  2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ పథకం వర్తింపజేయాలని  తీర్పునిచ్చిందన్నారు.  2005 నుంచి జరుగుతున్న డీఎస్సీ 2003 ఉపాద్యాయుల పోరాటానికి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఫలితం దక్కడంతో  ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు.

2003 డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ అంతా పూర్తియినప్పటికి అప్పటి  ప్రభుత్వము నియామక ఉత్తర్వులు ఆలస్యంగా ఇచ్చిందనీ,  ఇరవై ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాలు కలిగిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ పెన్షన్, ప్రజా సంక్షేమ శాఖ  ఫిబ్రవరి 17, 202O న విడుదల చేసిన 57/4,57/5 ప్రకారం  హై కోర్ట్ తీర్పు ను అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు పాతపెన్షన్ వర్తింపజేయాలని  కేంద్ర ప్రభుత్వం  చెప్పిందనీ, ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేయకుండా   2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు   హైకోర్టు తీర్పును అనుసరించి పాత పెన్షన్ వర్తింపజేయాలని  జిల్లా అధ్యక్షులు కొక్కుల శ్రీకాంత్ తెలియజేశారు.  

హైకోర్టు తీర్పు ఆధారంగా  పాత పెన్షన్ ను అమలు చేయాలని,  కేంద్రప్రభుత్వం 57/4,57/5 మెమోలను దేశం లో 15 రాష్ట్రాలలో అమలుచేస్తున్నాయని, ఆ మెమో ల ఆధారంగా, హై కోర్ట్  తీర్పు ను అనుసరించి తక్షణమే తెలంగాణ లో 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కొట్టూరు దుర్గాప్రసాద్  తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బాధ్యులు విజయ్ వర్ధన్,మండల బాధ్యులు గిరి, అనిల్, రాము, శ్రీను, నరేష్, ఎల్లగౌడ్,  దుర్గయ్య ,శ్రీధర్  ప్రదీప్ లతో పాటు 35 మంది ఉపాద్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img