Saturday, December 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూరప్‌లో చర్చలకు అమెరికా బృందం?

యూరప్‌లో చర్చలకు అమెరికా బృందం?

- Advertisement -

వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంపై యూరప్‌లో జరిగే చర్చలకు అమెరికా తన బృందాన్ని పంపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎలాంటి ఒప్పందాలు కుదరని ఇలాంటి చర్చలతో అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ విసిగిపోయారని తెలిపింది. వైట్‌హౌస్‌ మీడియా సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ విలేకరులతో మాట్లాడుతూ రెండు దేశాల వైఖరితో ట్రంప్‌ నిరాశ చెందారని, యూరప్‌లో జరిగే చర్చల్లో శాంతి ఒప్పందం కుదరడానికి నిజమైన అవకాశం ఉంటే ట్రంప్‌ ప్రతినిధి బృందాన్ని పంపుతారని తెలిపారు. ‘సమావేశాల కోసమే సమావేశాలంటే ట్రంప్‌ విసుగ్గా ఉన్నారు’ అని లీవిట్‌ చెప్పారు. అయితే ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ నాయకులతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడారని, ఈ సంభాషణల్లో యూరప్‌లో చర్చల ప్రస్తావన కూడా వచ్చిందని తెలిపారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ముగింపునకు త్వరగా చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ కోరుకుంటున్నారని, ఈ రెండు దేశాలతో గతరెండువారాల్లో అమెరికా అధికారులు 30 గంటలకు పైగా చర్చలు జరిపారని, కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదని లీవిట్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -