Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందుబాటులో ఉంటూ.. ఇంకా అభివృద్ధి చేస్తా

అందుబాటులో ఉంటూ.. ఇంకా అభివృద్ధి చేస్తా

- Advertisement -

సర్పంచ్ అభ్యర్థి మెండే సైదులు..
నవతెలంగాణ – పెద్దవూర

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మెండే సైదులు, బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మండే సైదులు మాట్లాడుతూ.. నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధి,ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని, గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల పుస్తకాలు సమకూరుస్తానని,గ్రామంలో యువకులు, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా వారి కోసం ఒక క్రీడా ప్రాంగణం, ఓపెన్ వ్యాయామశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో నిరుద్యోగ మహిళలకు అలాగే గ్రామం “విడిచి వలస వెళ్లిన వారి కోసం చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని,అలాగే గ్రామంలో ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగాతీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని అన్నారు.

తుంగతుర్తి గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత, మహిళలు పార్టీలకతీతంగా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే గ్రామంలో ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా 1116, ప్రతి పేద కుటుంబ ఆడబిడ్డకు పెండ్లి కానుకగా 5116, మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ భరోసాగా 5116 లు ఇస్తానని చెప్పారు. అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఉ చితంగా బెల్టు టైలు బ్యాడ్జీలు అందజేయడం జరుగుతుందని అన్నారు.కనుక గ్రామస్తులంతా పలుమార్లు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మెండే. సైదులు విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -