నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.17 లక్షల నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. విద్యార్థులు బస్సు సౌకర్యం కోరగా, సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ,నాణ్యమైన బోధనకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అనంతరం ఆయన కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర ఆలయ ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై,స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆలయ పాలకమండలి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరిగాయని పేర్కొన్నారు.
రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని,అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు.ఆలయ కళ్యాణ మండప నిర్మాణానికి రూ.10 లక్షలు,ధ్యాన మందిరానికి రూ.10 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు,ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ఆయన,రాయికల్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి దాతలు,భక్తుల సహకారం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున,ఎంపీడీవో బింగి చిరంజీవి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,నాయకులు కోల శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి,అనుపురం శ్రీనివాస్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దనవేని రాములు యాదవ్,ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ రావు,పల్లపు వెంకట్, లచ్చన్న,ముక్కెర లక్ష్మీ,పోతేవేని సత్యనారాయ పాల్గొన్నారు.
రాయికల్ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



