Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కూరగాయల మార్కెట్ గురించి ఆర్టీసీ అధికారులతో చర్చిస్తా..

కూరగాయల మార్కెట్ గురించి ఆర్టీసీ అధికారులతో చర్చిస్తా..

- Advertisement -

ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోజు వారి కూరగాయల మార్కెట్ నెలకొల్పడానికి ఆర్టీసీ అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. బుదవారం ఆర్టిసి బస్టాండ్ వద్ద ఉన్న ఖాలీ స్థలాన్ని నాయకులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు, స్థానికులు మాట్లాడుతూ ప్రతి రోజూ కూరగాయలు రోడ్డు వేంట అమ్మకాలు చేపడుతున్నారని, దిండుతో రాకపోకలకు, తివ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యకు పరిష్కారం బస్టాండ్ వద్దనే ఏర్పడు చేసే విధంగా చూడాలని కోరారు.

అనంతరం మండలంలోని వెంగళ్ పాండ్ పాటితండా వద్ద ఉన్న బ్రిడ్జిని పరిశిలించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వైశాలకు గాను నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ఇరువైపుల మట్టి కొట్టుకుపోవడంతో వాహనదారులకు ఇబ్బందుల అవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పరిశీలించి తగు సూచనలు సలహాలను అందజేశారు. ఆయన వెంట నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు,తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల కిషన్, సీనియర్ నాయకులు డాక్టర్ సామల రాజేశ్, తోపాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad