Wednesday, November 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరానున్న రోజుల్లో న్యూక్లియ‌ర్ మిసైల్స్ త‌యారు చేస్తాం: ర‌ష్యా

రానున్న రోజుల్లో న్యూక్లియ‌ర్ మిసైల్స్ త‌యారు చేస్తాం: ర‌ష్యా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రానున్న రోజుల్లో న్యూక్లియ‌ర్ సాంకేతిక‌త‌తో కూడిన మిసైల్స్‌ను త‌యారు చేస్తామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ అన్నారు. క్రెమ్లిన్‌ వేదిక నిర్వ‌హించిన వెపన్స్ డెవలపర్‌లకు అవార్డుప్ర‌ధానోత్స‌వం కార్య‌క్రమానికి ఆయ‌న హాజ‌రైయ్యారు. ఈ సంద‌ర్భంగా పుతిన్ మాట్లాడారు..భ‌విష్య‌త్తులో అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణుల వేగం “శబ్దం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఉంటుంద‌ని, అవి హైపర్‌సోనిక్‌గా మాదిరిగా ప‌ని చేస్తాయ‌ని చెప్పారు. అందుకు త‌గ్గ‌ట్లుగా స‌న్నాహాలు త‌మ ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింద‌న్నారు. బ్యూరేవెస్ట్నిక్(Burevestnik) క్షిపణి అధునాతన సామర్థ్యాలను ప్రదర్శించిందని పుతిన్ చెప్పారు. “ఫ్లైట్ రేంజ్ పరంగా, బ్యూరెవెస్ట్నిక్ … ప్రపంచంలోని అన్ని తెలిసిన క్షిపణి వ్యవస్థలను అధిగమించింద‌ని పుతిన్ తన ప్రసంగంలో అన్నారు. 21 శ‌తాబ్దంలో న్యూక్లియ‌ర్ మిస్సైల్స్‌కు అధిక ప్రాధాన్య‌త ఉంద‌ని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -