- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలోనే తాను పుతిన్ తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.పశ్చిమాసియా పర్యటన ముగించుకుని ట్రంప్ అమెరికా తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వీలైనంత త్వరలోనే పుతిన్‌తో నేను ముఖాముఖిగా సమావేశమవుతా’’ అని ట్రంప్ వెల్లడించారు. తన కుమార్తె టిఫనీ బిడ్డకు జన్మనిచ్చిందని, అందుకే తాను వెంటనే అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్దమని అందుకు ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాలు చర్చించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మాటాలను స్వాగతించిన జెలన్‌స్కీ అందుకు అంగీకరించారు.
- Advertisement -