Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలు అమలయ్యేనా.?

నిబంధనలు అమలయ్యేనా.?

- Advertisement -

రేపటి నుంచే అమల్లోకి నూతన మద్యం పాలసీ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగిసింది. 2025-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ నేటి నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎక్షైక్ శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ద కొత్త మద్యం పాలసీ నిర్వ హణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎక్సైజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది.జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి ఆనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి.

కొత్త మద్యం పాలసీ నిర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా?మామూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి.50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్,తినుబండారాలు విక్రయించకూడదు. కానీ మంథని నియోజకవర్గంలోని కాటారం,మహముత్తరం, మల్హర్, మహాదేవపూర్, పలిమేల మండలాల్లో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -