Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుMLC Kavitha: దసరా తర్వాత యాత్ర చేస్తా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: దసరా తర్వాత యాత్ర చేస్తా: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణకు కొంగు బంగారం.. ప్రకృతి ఇచ్చిన వరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ఆఫీస్‌లో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని అన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం 40 వేల మంది ఉద్యోగులు సింగరేణిలో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 18 నుంచి 20శాతం వరకు బొగ్గుమాత్రమే వెలికితీశాము. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలి.

హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని అన్నారు.సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలి. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సరైన వేతనాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల అమలు కోసం దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి యాత్ర చేస్తామని కవిత కీలక ప్రకటన చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad