Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -

దుర్కి సర్పంచ్ ఉమ నారగౌడ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

దుర్కి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన  గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారా గౌడ్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా పోటీలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఉమా నారా గౌడ్ కు అభిమానులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉమా నారా గౌడ్ మాట్లాడుతూ తన విజయానికి కృషిచేసిన దివిటి శ్రీనివాస్ యాదవ్, కిషోర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అందరికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ ముందుకు సాగుతానని అన్నారు. వీరి వెంట మాజీ ఎంపిటిసి  వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -