Friday, July 4, 2025
E-PAPER
Homeఆటలుసిరీస్‌ సాధిస్తారా?

సిరీస్‌ సాధిస్తారా?

- Advertisement -

భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళల మూడో టీ20 నేడు
లండన్‌ :
ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ ఇండియా అమ్మాయిలు చారిత్రక సిరీస్‌ విజయం ముంగిట నిలిచారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత మహిళలు 2-0తో ఆధిక్యంలో నిలిచారు. తొలి రెండు మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. నేడు మూడో టీ20లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌కు అడుగు దూరంలో నిలిచిన భారత్‌ నేడు మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌. స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగస్‌, ఆమన్‌జ్యోత్‌ సహా షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాట్‌తో, బంతితో సమిష్టిగా రాణిస్తున్న అమ్మాయిలు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. మరోవైపు వరుస ఓటముల నైరాశ్యంలో పడిన ఇంగ్లాండ్‌.. కెప్టెన్‌ నటాలీ సీవర్‌ సేవలను కోల్పోయింది. రెండో టీ20లో గాయపడిన సీవర్‌ నేడు అందుబాటులో ఉండటం లేదు. ఓపెనర్‌ టామీ బ్యూమోంట్‌ నాయకత్వంలో ఇంగ్లాండ్‌ సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలని చూస్తుంది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సైతం గాయంతో గత మ్యాచ్‌కు దూరమైంది. నేడు మ్యాచ్‌లో ఆమె ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టీ20 రాత్రి 11.05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆరంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -