మాజీ ఎంపీపీ సుదర్శన్
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రజల వెంబడి ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఎన్నికలలో గెలిచినా.. ఓడిన ప్రజల కోసమే పని చేస్తానని మాజీ ఎంపీపీ సుదర్శన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సుదర్శన్ తండ్రి బాలయ్య జ్ఞాపకార్ధకంగా మిడ్జిల్ గ్రామ పంచాయతీకి డెడ్ బాడీ ఫ్రీజర్ను మాజీ జెడ్పిటిసి హైమావతి బాల్ రెడ్డితో కలిసి నూతన వార్డు మెంబర్లకు అందజేశారు.
స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలలో ఓడిపోయిన కూడా వచ్చిన మాట ప్రకారం ఫ్రీజర్నునీ అందజేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికలలో గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలని, గ్రామా అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బత్తుల రమేష్,గుళ్ళ శ్రీశైలం ముదిరాజ్,శ్రీలత ప్రభుదాస్ మంజూల వరుణ్ రాజ్మాజీ ఉప సర్పంచ్ పద్మ మల్లయ్య మాజీ వార్డు సభ్యులు ఎలుగొండ రాదారెడ్డి,గొల్ల జంగయ్య,దానయ్య, గ్రామస్తులు బి ఆర్ఎస్, పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


