Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైన్స్ టెండర్లు.. ప్రజా ఆరోగ్యం కన్నా ఖజానా నింపుకోవడమే లక్ష్యం

వైన్స్ టెండర్లు.. ప్రజా ఆరోగ్యం కన్నా ఖజానా నింపుకోవడమే లక్ష్యం

- Advertisement -

ప్రభుత్వ పాలసీతో నష్టపోతున్న ప్రజలు వ్యాపారులు
ప్రజా ఆరోగ్యం కన్నా ఖజానా నింపుకోవడమే లక్ష్యం
యాదాద్రిలో 2647 టెండర్లు
ఎస్సీ, ఎస్టీ గౌడ రిజర్వేషన్లు పేరుకే
నవతెలంగాణ – ఆలేరు

ప్రభుత్వం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా మద్యం టెండర్లను ప్రోత్సహిస్తున్నట్లుగానే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని సైతం లెక్కపెట్టకుండా మద్యాన్ని విచ్చలవిడిగా గ్రామాలలో బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదు పైగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సిబ్బందికి టార్గెట్లు విధిస్తుంది. ప్రతిసంవత్సరం  అమ్మకాలు పెంచుకుంటూ ఆదాయ వనరుగా చేసుకుని ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. గతంలో కెసిఆర్ తెచ్చిన పాలసే ప్రస్తుతం కొనసాగుతుండడం, కాంగ్రెస్ చెప్పుకుంటున్న ప్రజా పాలన అంటే ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టం చేయడమేనా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. టెండర్ లో పాల్గొన్న వాళ్లు కూడా అనేకమంది నష్టపోతున్నారు.

జూదంలా తయారైంది ప్రభుత్వం మద్యం విధానం. ఇటీవల ప్రభుత్వం మద్యం టెండర్లు డిసెంబర్2025 నవంబర్ 2027 వరకు రెండు సంవత్సరాల పాటు. ద్యం షాపులు నడుపుకోవడానికి లాటరీ ద్వారా షాపులను కేటాయించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 18 చివరి తేదీ గా ప్రకటించింది.ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ ఉన్నది.ఆరోజు ఎలాంటి ప్రకటన చేయకుండా అర్ధరాత్రి అందరూ టెండర్లు వేశాక ప్రభుత్వము తరుపున ఎక్సైజ్ కమిషనర్ టెండర్లు వేసుకోవడానికి గడువు మరో ఐదు రోజులు పొడిగిస్తున్నామని అక్టోబర్ 23 వరకు టెండర్ల పాల్గొనవచ్చు అని ప్రకటనలు చేశారు. ముందుగా ప్రకటించిన టెండర్ ప్రక్రియ గెజిట్లో ఒక వైన్స్ కు10 కంటే పైన వచ్చిన వాటి అన్ని టెండర్లు లాటరీ పద్ధతిన కలెక్టర్ సమక్షంలో తీస్తారని ప్రకటించారు. 

అధిక టెండర్లు రాబట్టేందుకే

టెండర్లు వేశాక రాష్ట్ర బంద్ పిలుపు సాకుతో మరిన్ని టెండర్లు రాబట్టేందుకే పొడిగించారని విమర్శలు వస్తున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా లో ఈనెల 18వ తేదీ 10 గంటల వరకు 2647 టెండర్లు 83 షాపులకు 32.28 చొప్పున సగటున దాఖలయ్యాయి. తక్కువలో తక్కువగా 14 నుండి ఎక్కువలో ఎక్కువగా 70 వరకు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సగటుననే టెం డర్లు పడ్డాయి.అయినప్పటికీ ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ 23 తేదీన లాటరీ తీయకుండా పొడిగించడం.నిరుద్యోగం వల్ల ఉపాధి లేక టెండర్లు వేసి  వైన్స్ వస్తే ఒక రెండు ఏళ్లపాటు పని ఉంటుందనుకున్న వారికి ఆశలు రేపి ఆవిరి చేయడమే అయ్యింది..గడువు పెంచి మరిన్ని టెండర్లు వేసే విధంగా ప్రోత్సహించడం వారిని మరింత నష్టపరచడానికి తప్ప వారిని ఉద్ధరించడానికి కాదని వైన్స్ వ్యాపారం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు అంటున్నారు.

ఒక్కొక్క షాపుకు 32.28 టోకెన్లుకు మూడు లక్షల చొప్పున ఒక్కొక్క షాపుకు లాటరీ వేయడం ద్వారా 96 లక్షల 84 వేల రూపాయలు.వచ్చిన ప్రభుత్వం టెండర్ల గడువు పెంచడం పాల్గొనేవారు మరింత ఆర్థికంగా నష్టపోవడం తప్ప మిగిలేదేమి ఉండదు అంటున్నారు.గతంలో నడిపిన వారు చెబుతున్న మాటలను బట్టి ఒక షాపు వస్తే65 నుండి 70 లక్షల రూపాయల వరకు యావరేజ్ గా వస్తాయన్నారు.షాపు కిరాయిలు వడ్డీలు జీతాలు ఫర్నిచర్ ట్రాన్స్పోర్ట్ ఇతర ఖర్చులు ఫోను వచ్చే మొత్తం ఇది

ప్రభుత్వానికి ఎంత ఆదాయం 

 ప్రభుత్వానికి మాత్రం అదే సమయంలో 1, వ ఆదాయం క్రింద రెండు సంవత్సరాలకు లాటరీ ద్వారా 96 లక్షల 84000 ఆదాయం తోపాటు 2,వ ఆదాయం కంపెనీల వద్ద నుండి మద్యం తక్కువ ధరకు తీసుకొని 60 శాతం ఎక్కువ ధరతో వైన్స్ ద్వారా మద్యం అమ్మకాలు జరుపుతుంది. ఒక షాపు సంవత్సరానికి 10 కోట్లు సుమారుగా అమ్ముతుంది 60 శాతం ప్రభుత్వం ఎక్కువ ధర తో అమ్మడం ద్వారా  ప్రభుత్వానికి ఆరు కోట్లు వస్తాయి అంటే రెండు సంవత్సరాలకు 12 కోట్లు రూపాయలు 3 వ ఆదాయం రెంటల్ రెండు సంవత్సరాలకు కోటి పది నుండి కోటి 20 లక్షల రూపాయల వరకు వరకు షాపులను బట్టి వసూలు అవుతుంది.4 ,వ ఆదాయం కి పర్మిట్ రూమ్ రెండు సంవత్సరాలకు 10 లక్షలు సమకూరుతుంది.

 మొత్తం ఒక షాపు పేరుతో 14 కోట్ల ఇరవై ఒక్క లక్ష 84000. పై లెక్కను  బట్టి తెలుస్తుంది.ఇందులో ప్రభుత్వానికి ఆదాయమే తప్ప షాపు వచ్చినవారు రానివారు నష్టపోతున్నారు వైన్ షాప్ వచ్చిన వారు ఎలాగంటే మళ్లీ వచ్చే రెండో సంవత్సరాలకు 25 నుండి 30 ఆశతో టెండర్లు వేస్తున్నారు. అందుకే మద్యం వ్యాపారం మంది నెత్తులు మంది ఏ కత్తులు  అని ప్రజలు అనుకుంటున్నారు

రిజర్వేషన్ తో లాభమేమిటి? 

ఎస్సీ ఎస్టీ గౌడ రిజర్వేషన్ పేరిట వారిని ఆకర్షించి టెండర్లు పెంచుకోవడానికి తప్ప ఎలాంటి ఉపయోగం లేదు ఆ రిజర్వేషన్ షాపులలో కూడా జనరల్ పడిన దానికంటే కూడా ఎక్కువగా పడుతున్నాయి భువనగిరి మండలంలోని బట్టుగూడెం గౌడ రిజర్వేషన్ వైన్స్ లో 74 టోకెన్లతో అత్యధికంగా ఓపెన్ ఫర్ ఆల్ కంటే ఎక్కువ సగటు కంటే రెండింతలకు పైగా రావడం గౌడ్స్ ఆశ్చర్యపోతున్నారు. యాదగిరిగుట్టలో ఎస్సి రిజర్వేషన్ వైన్స్ లో 38 టెండర్లు వచ్చాయి బీబీనగర్ ఎస్టీ షాపులో 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.

దీనిబట్టి రిజర్వేషన్ పేరుకే తప్ప ఆయా వర్గాలకు ఎలాంటి ఉపయోగలు లేదని నిర్ధారణ అవుతుంది. తమకేదో ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆశపడి మోసపోవద్దని వాస్తవాలను గ్రహించి ఇప్పుడు రిజర్వేషన్ కంటే ఓపెన్ ఫర్ ఆల్ వేసుకోవడమే మంచిదని రిజర్వేషన్లు వేసినవారు భావిస్తున్నారు. ప్రభుత్వం గడువు ఇచ్చిందని జేబులు కాళీ చేసుకోవద్దని మద్యం వ్యాపారం పట్ల అనుభవం ఉన్నవారు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -