నవతెలంగాణ – సిద్ధిపేట: సిద్ధిపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో 17వ ఈశా గ్రామోత్సవంలో జరిగిన క్రీడలు ముగిసినట్లు డివై ఏస్ ఓ వెంకట నరసయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పురుషుల వాలీబాల్ విభాగంలో 25 జట్లు, మహిళల త్రోబాల్ విభాగంలో 8 జట్లు పాల్గొన్నట్లు తెలిపారు. త్రోబాల్ (మహిళలు)లో మందపల్లి జట్టు, కొమురవెల్లి జట్టులు విజేతలుగా నిలిచాయని, వాలీబాల్ (పురుషులు) పోటీలలో మల్లికార్జున స్వామి జట్టు ఐనాపూర్, డ్రాగన్స్ జట్టు రాయపోలు గ్రామం విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. మీరు సెప్టెంబర్ 21న కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విజేత జట్లకు మెరిట్ సర్టిఫికెట్‌లు, రిజువినేషన్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయబడతాయనీ అన్నారు. వాలీబాల్ (పురుషులు) మరియు త్రోబాల్ (మహిళలు) కేటగిరీల్లో చెరో రూ. 5 లక్షల ప్రధాన బహుమతి, మొత్తం కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు ఇవ్వబడతాయనీ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బండారుపల్లి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, మేకల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఈశా గ్రామోత్సవంలో విజేతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES