ఎమ్3 మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి, నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో, హీరోయిన్లుగా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను పాత్రికేయుల సమక్షంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని మేము లిమిటెడ్ బడ్జెట్‌తో ప్రారంభించాం. మా హీరో, హీరోయిన్‌కి ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. అందరికి సుపరిచితులైన రాశి, వినోద్ కుమార్, సురేఖ వాణి, రాజా రవీంద్ర.. ఇలా చాలా మంది పాపులర్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించాం. షూటింగ్ మొత్తం పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. త్వరలో మీ ముందుకు వస్తాం’ అని తెలిపారు. హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ, ‘టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.విజువల్స్ చాలా బాగున్నాయి’ అని తెలిపారు. హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ, ”టైటిల్ చాలా బాగుంది. నా మొదటి సినిమా ఇంత మంచి టైటిల్‌తో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని అన్నారు.