Thursday, July 31, 2025
E-PAPER
Homeసినిమాకట్‌ బ్యాక్‌ స్క్రీన్‌ప్లేతో..

కట్‌ బ్యాక్‌ స్క్రీన్‌ప్లేతో..

- Advertisement -

ధనుష్‌ రఘుముద్రి, హేబా పటేల్‌, రేఖా నిరోషా హీరో, హీరో యిన్లుగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ డియర్‌’. మహా లక్ష్మి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో కృష్ణ వంశీ వద్ద అసోసి యేట్‌ డైరెక్టర్‌గా చేసిన తోట శ్రీకాంత్‌ కుమార్‌ దీనికి రచన, దర్శకత్వం చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, కట్‌బ్యాక్‌ స్క్రీన్‌ప్లేతో వరల్డ్‌ బర్నింగ్‌ ఇష్యూ గురించి వివరించిన ఈ చిత్రం విడుదల కాకముందే హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌ 50 సంవత్సరాల గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శితమైంది. అలాగే 15వ గోవా ఇంటర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌తో పాటు, బెంగళూరు ఇండియా ఆర్ట్‌ అండ్‌ లిటలేచర్‌ అసోసియేషన్‌, వెస్ట్‌ బెంగాల్‌ వెల్రెడ్‌ అసోసియేషన్‌ నుంచి హెబ్బా పటేల్‌ ఉత్తమ నటిగా, డెబ్యూ ప్రొడ్యూసర్‌గా పప్పు బాలాజీ రెడ్డి, సహాయ నటీనటులుగా నాగ మహేష్‌, రేఖ నిరోషా అవార్డ్స్‌ పొందారు. పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ తోట మాట్లాడుతూ,’ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్‌ పాయింట్‌కి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా ఈ సినిమా చేశాం. ఈ సినిమా అంతా కట్‌ బ్యాక్‌ స్క్రీన్‌ప్లేలో ఉంటూ, మంచి సందేశంతో అందరూ కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత బాలాజీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -