పెండింగ్ కేసులు తగ్గించాలి
చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఆయా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉన్నతాధి కారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ కోర్టులలో కేసుల పెండింగ్ తగ్గించడంతో పాటు డిజిటల్ రికార్డుల నిర్వహణ, సీసీఎంఎస్ ద్వారా కోర్టు కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షణ చేయడం, సమాచార వ్యవస్థలో పారదర్శకతను పాటించడం, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలని వివరించారు. సాంకేతికతను అలవాటు చేసుకోవడం ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారముంటుందని తెలిపారు. సుప్రీంకోర్టుతోపాటు బీహార్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పర్యవేక్షణా వ్యవస్థను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు కషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యసాధనకు ఈ సాంకేతిక వ్యవస్థ ఉపకరిస్తుందని గుర్తుచేశారు. ప్రధానంగా న్యాయశాఖ, రెవెన్యూశాఖ, హోంశాఖ విభాగాల అధికారులు ఎన్‌ఐఐసీని సంప్రదించి వారం రోజుల్లోగా కార్యాచరణ నివేదికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, జీఏడీ కార్యదర్శి బీఎండీ ఎక్కా, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆధునిక సాంకేతికతతో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES