Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి 

రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు రాకను గమనించకుండా రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టగా కలిగిన గాయాలతో మహిళ మృతి చెందిందని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 6వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక గుర్తు తెలియని మహిళ వయస్సు అందాజ (50)యం నంబర్ 456-14, నిజామాబాదు – జానకంపేటు మధ్య గుర్తు తెలియని రైలు యొక్క రాకను గమనించకుండ రైలు పట్టాలు దాటుతుండగా అట్టి రైలు ఢీ కొట్టగా కలిగిన గాయల వల్ల అక్కడిక్కడే మృతి చెందినట్లు కనిపిస్తుంది. మృతురాలి వద్ద గుర్థించుటకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూం కు తరలించామన్నారు. మృతురాలిని గుర్తించినచో నిజామాబాద్ రైల్వే పోలీస్  8712658591, 9493451642 నెంబరుకు సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -