- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హోంగార్డు ప్రేమ పేరుతో ఓ మహిళను నమ్మించి గర్భవతిని చేశాడు. ఆర్ఎంపీ (RMP) వద్ద అబార్షన్ చేయిస్తుండగా సదరు మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డు మధుసూదన్ ప్రేమ పేరుతో మౌనిక(29)ను లోబర్చుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్ద అబార్షన్ చేయిస్తుండగా.. వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావంతో మౌనిక మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదులో హోంగార్డు, ఆర్ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -