- Advertisement -
నవతెలంగాణ – చందుర్తి
అంబులెన్స్ లో ఓ మహిళ ప్రసవించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సనుగుల గ్రామానికి చెందిన శిరీష అనే మహిళకు గురువారం పురిటి నొప్పులు రావడంతో బంధువులు అంబులెన్స్ 108 కు సమాచారం ఇచ్చారు. దీంతో వేములవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శిరీష ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని అంబులెన్స్ మెడికల్ టెక్నీషన్ గణేష్ , మహేష్ తెలిపారు.
- Advertisement -