అనుమతులు లేని సంస్థలతో ప్రజలు మోసపోవద్దు
పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
హెప్సిబ పేరుతో ఆర్పిఎఫ్ మార్కెటింగ్, మనీలాండరింగ్ నిర్వహిస్తూ పేద ప్రజలను మోసం చేస్తూ ఐడీల పేరుతో లక్షలు కొల్లగొట్టిన ఆర్పిఎఫ్ ఏజెంట్లను, నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామని పాలకుర్తి సీఐ వంగాలి జానకి రామ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహిళలను అరెస్టు చేసిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై దూలం పవన్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంలో గల గుడివాడ చౌరస్తాలో హనుమతుల లేని సంస్థల పేరుతో మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు.
2023 లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గండేపల్లి గ్రామానికి చెందిన తెప్పాలా సైదులు తన భార్య పేరున అనుమతులు లేని సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారని తెలిపారు. సైదులు తో పాటు మరో ముగ్గురిని గత నెలలో అరెస్టు చేశామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేసిన నిర్వాహకురాలు నారాయణమ్మతో పాటు తో పాటు మహిళ ఏజెంట్లు మనబోతుల శోభ, పొడిలా నాగలక్ష్మి లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని తెలిపారు. అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడే వ్యక్తులను, సంస్థలను చూసి ప్రజలు మోసపోవద్దని సూచించారు.