- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కష్టపడి పని చేసే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. సోమవారం గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. దీంతో పార్టీ కోసం కష్టపడే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
- Advertisement -