Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

- Advertisement -

ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణ కేంద్రంలోని శుక్రవారం గర్ల్స్ హైస్కూల్, బాయ్స్ హైస్కూల్,ప్రైమరీ స్కూల్‌లలో విద్యార్థినిలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థి రంగంలో ఉన్న సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఎస్ఎఫ్ఐ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పుట్టల విద్యాసాగర్, సభ్యులు ఎం.డి.లతీఫ్, తిలకు సిద్ధు, రేగోటి ప్రశాంత్, రాజు కుమార్‌తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -