– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉప అధికారి డాక్టర్ రమేష్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉప అధికారి డాక్టర్ రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన మహిళ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ శిబిరంలో పలువురు ప్రత్యేక వైద్యులు పాల్గొని ఆరోగ్య సమస్యలతో వచ్చిన మహిళలకు చికిత్సను అందజేశారు. ప్రత్యేక మహిళల వైద్య శిబిరంలో ఫిజీషియన్ డాక్టర్ ఫాతిమా, చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కుసుమ, జనరల్ సర్జన్ డాక్టర్ తిరుపతి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి, చెవి వైద్య నిపుణులు డాక్టర్ ఆది, దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, తదితర వైద్యులు పాల్గొని రోగులకు సేవలు అందించారు.
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ రమేష్ ఆస్పత్రి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.ఈ శిబిరంలో 264 మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, సూపర్వైజర్ స్వరూప,ల్యాబ్ టెక్నీషియన్ రాంబాబు, పవన్, ఫార్మసిస్ట్ అరుణ్ కుమార్, ఆస్పత్రి సిబ్బంది రిషి, దివ్య, దుర్గ, కీర్తి, జయ, గీత, శ్యామల, రూప, అరుణ, సుజాత, మమత, అమృత, శోభారాణి, ప్రసన్న, విజయ లక్ష్మి, సంధ్య, డీఈవో మధు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES