Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఆరోగ్యమే ఆ కుటుంబానికి బలం

మహిళల ఆరోగ్యమే ఆ కుటుంబానికి బలం

- Advertisement -

వైద్యాధికారి డాక్టర్ మహారాజ్
నవతెలంగాణ- రాయపోల్

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని రాయపోల్ వైద్యాధికారి డా. మహారాజ్ అన్నారు. గురువారం రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థి నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రోగ్రాం అధికారి  డా. ఆనంద్, గజ్వేల్ డివిజన్ అధికారి డా. శ్రీనివాస్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం స్వస్థి నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.

మహిళలు శిశువులు సమతుల పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుటుంబం, సమాజం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. మహిళలు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యం కోసం వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో కళ్ళు, చెవులు, ముక్కు, గొంతు , చర్మం,ఇతర సమస్యలు వంటి రోగాలకు ఆయా విభాగాల డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. ప్రవీణ్, డా. రవితేజ, డా. వినీల, డా. ఫాతిమా, డా. శ్రావణి, డా. రచిత, డా. శివకుమార్, డా. స్టెన్లీ, డా. సారా ఫిరదోస్, హెచ్ఈఓ శ్రీనివాస్, సిబ్బంది వినోద, మంజు, నీరజ, మోహన్ రావు,ప్రవీణ్, లింగం, మంజుల, భాగ్య, ప్రేమ, మాధవి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -