నవతెలంగాణ-హైదరాబాద్ : ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ టాస్ గెలిచి, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంబమైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.



