Friday, June 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిశ్రమ చీమలు!

శ్రమ చీమలు!

- Advertisement -

పేదరికం కొండచిలువ నోట్లో
అథోముఖంతో జారిపడుతున్న ఆర్తనాదాలు
వారంతా!
తాండవం చేస్తున్న దారిద్య్రం
పాదాల కింద చితికిపోయిన
అతుకుల బతుకుల్లో మెతుకు భరోసా
కరిగే మేఘమై, ఎదిగీ ఎదగని
చిట్టిపొట్టి మాంసపు కండల వాసన పట్టి
వలేసే శ్రమ దోపిడీ బేహారుల
చేతచిక్కి భవిత భళ్ళుమన్న బ్రతుకులు వాళ్ళవి!
కన్నవాళ్ళ కనుసైగతోనో, కన్నుకప్పో
పాపం పసి ప్రాణాల్ని మాంసపు ముద్దల్లా
కట్టలకు కట్టగట్టి తూకమేసి
దొరికిన బేరానికి పొట్లాలు కట్టి
బతుకులు పార్సిళ్ళు చేసి చెమట పాతర్లలో
సజీవ సమాధి చేస్తుంటే..
ఖార్ఖాాల్లో కర్మాగారాల్లో ఖర్మకాలినట్టు
నిత్యం ఆకలి సంకెళ్లతో పోరాడి ఓడిపోతున్న
ప్రపంచం తెలీని ఆ తోటకూర దేహాలకు
తప్పించుకొనేదార్లు ఏం ఉంటారు..?
పని మొలకెత్తే ప్రతీ చోటా శ్లేష్మంలో ఈగలా
చిక్కిపోతూ, రెక్కలు ముక్కలు చేసికొంటూ
బతుకులు బండలు చేసికొంటూ
గాజు చూపులతో బూజు హదయాలతో
గడియారం ముళ్ళలో చిక్కిన తెగిన పతంగాల్లా
నాలుగు మెతుకుల కోసం నలభై తిరవాట్లు పడుతూ
ఏదో బతికున్నాం అనిపించుకోడం తప్ప!
(బాలకార్మిక వ్యతిరేక దినం సందర్భంగా..)
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -