Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

- Advertisement -

నేను అండగా ఉంటా: ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ గ్రామ అభివృద్దికి ప్రజల సహకరిస్తే సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. నిస్వార్థ పరులైన ఉషా సంతోష్ మేస్త్రికి, గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఉష సంతోష్ మేస్త్రీకి ప్రజలు, పాలకవర్గం సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం సర్పంచ్ దంపతులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యేను సర్పంచ్ దంపతులు కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, గ్రామ అధ్యక్షులు బండి గోపి, మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్, ఉపసర్పంచ్ వట్నాల రమేష్, పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -