- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఉర చెరువు కట్టపై ఉన్న పిచ్చిమొక్కల పొదలు,తుమ్మచెట్లను తొలగించి, చెరువు కట్టపై మట్టి పోయాలని చెరువు ఆయకట్టు రైతులు, భూ నిర్వాసితులు ఇటీవల తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి విన్నవించినా సంగతి తెలిసిందే. అయితే శనివారం ఏఎమ్మార్ అధికారులు జేసిబితో చెరువు కట్టపై ఉన్న ముళ్ల పొదలు,పిచ్చి మొక్కల తొలగించారు. త్వరలోనే కట్టపై మట్టి పోయునట్లుగా తెలిపారు. ఇందుకు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -