Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తగిలి కార్మికుడికి గాయాలు

విద్యుత్ షాక్ తగిలి కార్మికుడికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
గత శనివారం రాత్రి బిచ్కుంద పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ లో పై పెచ్చులు ఊడి పడ్డాయి. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గురువారం ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లోని పై పెచ్చులు తీయడానికి కార్మికుని నియమించి పనులు చేపట్టారు. ఫయాజ్ అనే కార్మికుడు పై పెచ్చులు తొలిగిస్తు పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో కింద పడిపోయాడు అతని పై  పెచ్చులు ఊడి పడ్డాయి ఫయాజ్ చెయ్యి విరగడంతో పాటు తలకు మొహానికి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే తీవ్రంగా గాయపడిన ఫయాజ్ ను ఆర్టీసీ అధికారులు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గత 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరిందని బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో వెలసిన దుకాణాల ద్వారా నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా మరమ్మతుల విషయం అధికారులు పట్టించుకోకపోవడం లక్షల రూపాయల ఆదాయం వైపు చూపిస్తున్న శ్రద్ధ బస్టాండ్ మరమ్మతులపై చూపెట్టడం లేదని అందుకే ఆర్టీసీ బస్టాండ్ అద్వాన స్థితికి చేరిందని స్థానికులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -