Thursday, December 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మికుల శ్రమ - కార్పొరేట్ల దోపిడీ

కార్మికుల శ్రమ – కార్పొరేట్ల దోపిడీ

- Advertisement -

దేశంలో నయా ఉదారవాద విధానాల అమలు విశృంఖలంగా కొనసాగుతున్నది. 1991 ప్రారంభం లో ఎగుమతులు, దిగుమతులు సడలింపు, లైసెన్స్‌ విధానంలో మార్పులతో మొదలై ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు చేరింది. నేడు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిత్యకృత్యమైంది. కార్మికవర్గం శ్రమ దోపిడీకి గురవుతుంటే, పెట్టుబడి దారీ వర్గం సంపద పోగేసుకుం టూనే ఉన్నది. అయినా, ధనదాహం తీరడం లేదు. కార్మికవర్గం పోరాడి సాధించు కున్న చట్టాలన్నీ రద్దు చేయించింది. శ్రమను దోచుకోవడం కోసం వాళ్ల పారిశ్రామిక విప్లవం తొలినాళ్ల పని పద్ధతులు ఉండాలని కోరుకుంటున్నది. అందుకు తక్కువ వేతనం, ఎక్కువ పనిగంటలు డిమాండు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ సర్కార్‌ లేబర్‌కోడ్‌ల రూపంలో పనిగంటలు పెంచింది. దీన్నిబట్టి అర్థం చేసుకో వచ్చు, ఇది పెట్టుబడిదారి ప్రభుత్వమా, పేదల ప్రభు త్వమా? రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా రైల్వేలు, రోడ్లు, ఇన్సూరెన్సు, గోదాములు, టెలికం ఆస్తులు కూడా ప్రయివేటు వారికి అప్పగించే పనిలో ఉన్నది. ఇది ఎవరికి లాభం? గత బీఆర్‌ఎస్‌ పాలనపై విసుగుచెందిన కార్మికులు ఆ పార్టీని ఓడించారు. నేడు కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా అదేబాటలో నడవడం దేనికి సంకేతం?పార్టీలు వేరైనా విధానాలు ఒక్కటేనని చెప్పడమే కదా!

రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది 76 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌ పరిధిలో ఉన్నారు. వీరికి కనీస వేతన చట్టం 1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేతనాలు పెంచాలి. 2006-2012 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సవరించారు. పదిహేనేండ్లుగా కార్మికుల వేతనాలు పెంచకపోవడం వల్ల యాజమా న్యాలకు ప్రభుత్వమే వేలకోట్ల రూపాయలు మిగిలే విధంగా చేసి కార్మికుల శ్రమదోపిడీకి గురి చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించకుండా కార్మికు లను అర్థాకలితో బతికే విధంగా చేస్తున్నది. 2021లో ఇచ్చిన ఐదు జీవోల ప్రకారం కనీస వేతనం రూ.18,019 అమలు చేయాలని హైకోర్టు చెప్పినా యాజమాన్య సంఘాల ఒత్తిడికి లొంగి కార్మికులకు అన్యాయం చేసింది. హైదరాబాద్‌ దాని చుట్టూ ప్రాంతాల అభివద్ధి పరిశ్రమల విస్తరణతో పాటు సింగరేణి బొగ్గుగనులు సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి, తాండూరు మొదలైనటు వంటి సిమెంట్‌ పరిశ్ర మలు, పవర్‌ ప్రాజెక్ట్‌, కాగితపు పరిశ్రమలు, టెక్స్‌టైల్స్‌, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, డిఫెన్స్‌ సెక్టార్‌ భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ పెద్ద సంఖ్యలో ఏర్పా టు చేసి బహుళ జాతి కంపెనీలు విస్తరిం చాయి. ఇందులో కాంట్రాక్ట్‌ కార్మికులు, వలస కార్మికులు తొంభై శాతం ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు లేవు. కార్మిక చట్టాల అమలూ లేదు. పన్నెండు గంటల పని, రూ.12వేల వేతనంతో శ్రమదోపిడీకి గురవు తున్నారు.

సింగరేణి సంస్థ లాభాల్లో ఉన్నది.నలభై వేల మంది పర్మినెంట్‌, 26వేల మంది కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ పనిచేస్తున్నారు. సంస్థకు బొగ్గు, కరెంటు ఇతరాలకు ప్రభుత్వమే రూ.48 వేలకోట్లు చెల్లించవలసి వచ్చింది. కొత్త బావులు తవ్వడం లేదు. వాటికోసం రాష్ట్రం పోరాటం లేదు. కేంద్ర, రాష్ట్రాలు ఈ పదేండ్లలో రూ.78వేల కోట్లు పన్నుల రూపంలో తీసుకున్నాయి. కానీ సంస్థ అభివద్ధికి తోడ్పాటు అందిం చడం లేదు. కార్మికులకు న్యాయంగా రావాల్సిన జీతభత్యాలు కూడా చెల్లించడం లేదు. పర్మినెంట్‌ వర్కర్స్‌కు పెర్క్స్‌పై ఇన్‌కాంటాక్స్‌ రీయంబర్స్‌మెంట్‌ చేయడం లేదు. కాంట్రాక్ట్‌ వర్కర్లు 26వేల మంది శ్రమదోపిడీకి తీవ్రంగా గురవుతు న్నారు. కోలిండియా హైపవర్‌ కమిటీ నిర్ణయించిన ప్రకారం రూ.1285లు ఇవ్వాలి.ఈ లెక్కన సంవత్సరానికి రూ.24 కోట్లు ఒక కార్మికుడు నష్టపోతున్నాడు. ప్రతి నెలా రెండు కోట్లు, ఈ లెక్క ఏడాదికి 24 కోట్లు కార్మికులు నష్టపోయి సింగరేణి లాభపడుతుంది.ఇది ప్రభుత్వ ప్రత్యక్ష దోపిడీ.అలాగే ఆర్టీసీలో 44వేల మంది పనిచేస్తున్నారు. 2017లో వీరికి వేతన బకాయి ఉంది. 2021,2025లో వేతనాలు సవరించాలి,కానీ నేటికీ ఆ పనిచేయలేదు. అన్నీ లెక్కలేస్తే ప్రతీ కార్మికుడికి పది లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో పర్మినెంట్‌ పెన్షన్స్‌ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ స్కీమ్‌ వర్కర్ల పేరిట పదిహేను లక్షలకు పైగా ఉన్నారు. వీరందరికీ 2023 జూలైలో వేతనాలు పెంచాల్సి ఉంది. రెండేండ్లు గడిచినా వేతన సవరణ చేయకపో వటంతో వందల కోట్లు నష్ట పోతున్నారు. ప్రతినెలా సుమారు 900 మంది రిటైర్‌ అవుతున్నారు. వీరికి ఇప్పటివరకు సుమారు 12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. అన్నింటిలోనూ అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరందరికీ సమానపనికి సమాన వేతనం లేదు. రూ.17,500 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నేటికీ వెట్టిచాకిరీ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 15,600 నుండి 19500, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు రూ.9వేల నుండి రూ.12వేలు చెల్లిస్తున్నారు. స్కీంవర్కర్లు అంగన్వాడీలకు రూ.13,500, ఆయాలకు రూ.7వేలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3వేలు, ఐకెపి ఉద్యోగులకు రూ.5వేలు ఇస్తున్నారు. ఆశాలకు రూ.9750 పారితోషికం, ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌కు రూ.10వేలు మాత్రమే చెల్లిస్తూ విపరీతమైన శ్రమ చేయించుకుంటున్నారు.పర్మినెంట్‌ వర్కర్స్‌తో సమానంగా పనిచేసిన కూడా వీరికి మాత్రం కోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం వేతనాలివ్వడం లేదు. పర్మినెంట్‌ కూడా చేయడం లేదు.గ్రాట్యూటీ కూడా చెల్లించకుండా అన్యాయం చేస్తున్నది. ఈ రూపంలో ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు మిగుల్చు కుంటున్నది.

ఇక ప్రతి ఇంటికీ వెలుగునిచ్చే విద్యుత్‌ శాఖలో మాత్రం కార్మికులు చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి ఉంది. అందులో పనిచేసే ఆర్టి జన్స్‌ సుమారు 19567 మంది ఉన్నారు.నాలుగు గైడ్స్‌లోని వీరికి రూ.23వేల నుండి 52వేల వరకు ఉంది. ఇదే పనిచేసే పర్మి నెంట్‌ ఎంప్లారుకి రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. ప్రతి ఆర్టిజన్‌ నెలకు లక్ష, సంవత్సరానికి పన్నెండు లక్షలు నష్టపోతున్నాడు. ఈ లెక్కన పంతొమ్మిది వేల మందికి లెక్కిస్తే సంవత్స రానికి ఎన్ని వేలకోట్ల శ్రమదోపిడీకి గురవుతున్నారో పరిశీలించవచ్చు. అందుకే వీరు కూడా సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 1.40 లక్షల మంది స్థానిక సంస్థలలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఉద్యోగులకు రూ.9500 నుండి రూ.16వేల వరకు వేతన మిస్తున్నారు. వీరందరికీ కనీస వేతనం రూ.26వేలు చెల్లించక పోవడంతో చాలా నష్టపోతున్నారు. ప్రయివేటు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్ట్‌, భవన నిర్మాణ రంగాలు విస్తరిస్తున్నాయి. రెండు రంగాల్లో సుమారు నలభై లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనాలు లేవు. ఎనిమిది గంటల పనిదినమూ లేదు. పైగా యాజమాన్య దోపిడీ విపరీతంగా ఉంది. ఇటీవల గిగ్‌వర్కర్స్‌, ఫ్లాట్‌ ఫామ్‌ వర్కర్స్‌లో ఓలా, ఊబర్‌, జొమాటో, స్విగ్గి లాంటి వాటిలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. వారికి చట్టం తీసు కొచ్చామని చెబుతున్నా న్యాయం జరగటం లేదు.

మొత్తంగా తెలంగాణ కార్మికవర్గాన్ని పారిశ్రామిక వర్గం యథేచ్ఛగా శ్రమదోపిడీకి పాల్పడుతున్నది. అత్యధిక ధనవంతుల జాబితాలో దేశంలో ఉన్న వందమందిలో తెలంగాణలోని పది మంది బిలియనీర్ల సంపద రెండు లక్షల కోట్లకు పెరిగింది. మిలియనీర్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. కార్మికుల శ్రమను దోచుకుని లాభపడింది ఎవరనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మూడేండ్లలో కార్మికుల పోరాటాలు ఎన్నో జరిగాయి. దేశవ్యాప్త సంబంధాల్లో భాగంగా లక్షల మంది రోడ్లమీదికి వస్తున్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యా హ్నం భోజనం కార్మికులు సమ్మెలు ఊపంద కున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల కార్మికులు కూడా ఇదే బాటపట్టారు.మరోవైపు కేంద్ర బీజేపీ విధానాలు, లేబర్‌కోడ్‌లకు నిరసనగా సమ్మెలు, నిరసనలు రాష్ట్రంలో ఉధృతమయ్యాయి. రాబోయే కాలమంతా పోరాటకాలమే. ప్రభుత్వాలు ఇప్పటికైనా కండ్లు తెరిచి కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే రాజకీయంగా పతనంకాక తప్పదు.

భూపాల్‌
9490098043

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -