నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు అనుబంధం) రాష్ట్ర ఐదవ మహాసభలకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రతినిధులు హాజరయ్యారని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే మహాసభలకు గద్వాలలోని నాలుగు మున్సిపాలిటీల నుండి ప్రతినిధులు తరలి వెళ్లారని తెలిపారు. మున్సిపల్ కార్మికుల పర్మినెంట్, ఉద్యోగ భద్రత, అధికార వేధింపులు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు భవిష్యత్ కర్తవ్యాలు వంటి అనేక అంశాలపై మహాసభల్లో చర్చలు జరుగునున్నట్లు తెలిపారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు జరిగే మహాసభల సందర్బంగా మొదటి రోజు ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మహాసభలకు సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ రానున్నట్లు తెలిపారు. మహాసభలకు వెళ్ళిన వారిలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఏంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంజీవరాజు,ఘట్టన్న,పట్టణ అధ్యక్షుడు శివ, కోశాధికారి మహేష్ కుమార్, దయానంద్ వెళ్లారు.
మహాసభలకు బయలుదేరిన కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES