కాంగ్రెస్ మండల నాయకుడు మున్నూరు జయకర్
టీబీ పై ప్రత్యేక హెల్త్ క్యాంప్
నవతెలంగాణ – వనపర్తి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ ఘనపురం మండల నాయకుడు మున్నూరు జయకర్ సూచించారు. ఘణపురం మండలం ఆగారం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు – వసతులు, క్షయ వ్యాధిపై సోమవారం గ్రామసభ నిర్వహించి కూలీలు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవంలో గ్రామీణ వైద్యుడు శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తో కలిసి మున్నూరు జయకర్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, నిరంతరాయంగా 15 రోజులకు మించి దగ్గు ఉంటే క్షయ వ్యాధిగా గుర్తించాలని, ముందస్తుగా లక్షణాలు ఉంటే ప్రజలందరూ బీపీ షుగర్ ఇతర పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే టీబీ కోసం ఎక్సరే తదితర చికిత్స జరుగుతుందని ప్రజలకు వివరించారు. రోగం ఉన్నట్లు గుర్తిస్తే మందులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నుంచి వచ్చిన క్షయ, టీబీ వైద్య బృందం, స్థానిక ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



