Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి లాభాల్లో కార్మికులకు 35శాతానికి పైగా వాటా ఇవ్వాలి

సింగరేణి లాభాల్లో కార్మికులకు 35శాతానికి పైగా వాటా ఇవ్వాలి

- Advertisement -

మెడికల్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి : హెచ్‌ఎంఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్‌ఎంఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. దసరాకు ముందే కార్మికులకు బోనస్‌ను అందజేయాలని కోరారు. ఈ మేరకు హెచ్‌ఎంఎస్‌ జనరల్‌ సెక్రటరీ రియాజ్‌ అహ్మద్‌, కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ… అలియాస్‌ పేర్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు కార్మికులను డిస్మిస్‌ చేయడం దారుణమని అన్నారు. వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. మెడికల్‌ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీ-మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా నెలకు రెండుసార్లు మెడికల్‌ బోర్డు సమావేశం నిర్వహించాలని కోరారు. పదో తరగతి పాస్‌ కాలేదనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ… సింగరేణిలో అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పారు. దాన్ని కట్టడి చేయకపోతే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సంస్థలోని అవినీతిపై విచారించాలంటూ సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎమ్‌ఎస్‌ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎమ్‌ఎస్‌, తెలంగాణ జాగృతి నాయకులు కవితను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -