Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

- Advertisement -

ఇంటర్‌ విద్య డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య
టీజీజేఎల్‌ఏ 475 సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూనియర్‌ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకరాం అందిస్తానని ఇంటర్‌ విద్య డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఆయన టీజీజేఎల్‌ఏ 475 సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేషనల్‌ విద్యార్థులకు టీటీసీ చేసే అవకాశం కోసం సహకారం అందిస్తానని మాటిచ్చారు. 2023 బ్యాచ్‌ జూనియర్‌ లెక్చరర్లకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా మెడికల్‌ లీవ్స్‌ ఇతర సమస్యల్లోనూ అండగా ఉంటానని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,20,000 మంది విద్యార్థులు చేరేలా అందరం కలిసి కృషి చేద్దామని ప్రోత్సహించారు.

ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు నిధులు తీసుకొస్తాననీ, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల స్సౖస్‌ స్టోరీలను హైస్కూల్‌ విద్యార్థులకు చెప్పాలని ఆయన సూచించారు. అంతకు ముందు టీజీజేఎల్‌ఏ 475 సంఘం రాష్ట్ర అధ్యక్షలు డాక్టర్‌ వసుకుల శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌, రాష్ట్ర మహిళా కార్యదర్శులు సంగీత , షాహినా బేగం, రాష్ట్ర ఉపాధ్యక్షలు ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, మహబూబాద్‌ జిల్లా అధ్యక్షలు డి.రవి కిరణ్‌, రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఉస్కు మల్ల శ్రీనివాస్‌ తదితరులు జూనియర్‌ లెక్చరర్ల సమస్యలను కృష్ణ ఆదిత్య దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -