సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లకు పనివారని తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఏ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ ప్రగతి భవన్ వద్ద నిరసన చేసి అనంతరం నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ ఈ / ఓ పి/ నిజామాబాద్ అండ్ డి ఈ టి రమేష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ .. డిచ్పల్లి డివిజన్ లో పనిచేస్తున్న సబ్ స్టేషన్ ఆపరేటర్లు అధిక పనిభారం తో పనిచేస్తున్నందున ఒక్కో సబ్స్టేషన్లో నలుగురు చేయాల్సిన పని ఇద్దరితోనే అధికారులు పనిచేస్తున్నారు.
పని భారం ఎక్కువ అవ్వడం వల్ల వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సిరికొండ సెక్షన్ జక్రాన్పల్లి సెక్షన్ గడుకోల్ సెక్షన్ దరిపల్లి సెక్షన్ లో అధిక పనిభారంతో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Artisan లకు ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఎక్కువ పనిదినాలు విధులు నిర్వర్తిస్తే (ఓ టీ) అధిక వేతనాన్ని చెల్లించాలి. కానీ అధికారులు చెల్లించడం లేదు. సబ్స్టేషన్లలో బాత్రూమ్ సౌకర్యం లేదు, యార్డ్ లైటింగ్ లేదు కావున ఇట్టి విషయాలను జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని పని భారాన్ని తగ్గిస్తామని హామీ ఇవ్వడంజరిగింది. కార్యక్రమలో నల్లురి నరేష్ మురళి జాదవ్, రవి, పాకాల మహేష్, ప్రభాకర్, నర్సింగ్, నరేష్, శ్రీనివాస్, సంతోష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.