నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు పతకం చేజారింది. సెమీఫైనల్ లో అత్యుత్తమ ప్రతిభ చాటి తుదిపోరుకు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఎనిమిదో స్థానంలో(84.03 మీటర్లు) నిలిచి పతకానికి బహు దూరంలో నిలిచాడు. అదే విధంగా మరో స్థార్ ప్లేయర్ సచిన్ యాదవ్ తుది సమరంలో అద్భతమైన ప్రతిభ కనబర్బాడు. ఫైనల్ పోరులో 86.27 మీటర్లు బళెం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో ఆయన తృటిలో కాంస్య పతకం చేజారాడు. అదే విధంగా పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ అర్షద్ నదీమ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఫైనల్ పోరులో ట్రినిడాడో దేశానికి చెందిన వాల్ కాట్ 88.16 మీటర్లు బళెం విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. గ్రెనెడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్ (87.38మీ) సిల్వర్, అమెరికా వాసి థాంప్సన్(86.68 మీ) బ్రోజ్ మెడల్ సాధించారు.
మొత్తం తుదిపోరులో 12మంది క్రీడాకారులు పోటీపడ్డారు.