Monday, November 3, 2025
E-PAPER
HomeఆటలుIND Vs SA: ప్రపంచ కప్ ఫైనల్..దక్షిణాఫ్రికా లక్ష్యం 299

IND Vs SA: ప్రపంచ కప్ ఫైనల్..దక్షిణాఫ్రికా లక్ష్యం 299

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణిత 50 ఓవ‌ర్ల‌కు భార‌త్ ఏడు వికెట్లు కోల్పోయి 298 ప‌రుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 299 భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20), అమన్‌జ్యోత్ కౌర్ (12) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3, మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -