నవతెలంగాణ- కట్టంగూర్
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడుతూ.. మానసిక సమస్యలను చిన్నచూపు చూడకుండా సరైన చికిత్స పొందటం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాక్షుడు రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివ, సహాయ కార్యదర్శి బసవోజు వినోద్, మంగదుడ్ల శ్రీనివాస్, రాపోలు వెంకటేశ్వర్లు. కడవేరు మల్లిఖార్జున్. ఉపాధ్యాయులు కొంక ఆంటోని, విఠల్, అబ్దుల్ గఫార్, చిన్ని శ్రీనివాస్ ఉన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES