భారత్-జపాన్ సంబంధాలు
చాలా కీలకం
టోక్యో : ప్రపంచ శాంతి, స్ధిరత్వానికి భారత్-జపాన్ మధ్య సంబంధాలు చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. శుక్రవారం టోక్యోలో భారత్-జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో మోడీ ప్రసంగించారు. జపాన్ సాంకేతికత, భారత్ ప్రతిభ ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహిస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారత్ రాజకీయ- ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వంటి అంశాల కారణంగా ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని మోడీ చెప్పారు. జపాన్ కంపెనీలు భారత్‌లో 40 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. 2047 నాటికి భారత్ 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన కోసం
చేరుకున్నారు. ముందుగా స్పీకర్ ఫుకుషిరో నుకాగా, జపాన్ పార్లమెంట్ సభ్యుల బృందంతో భేటీఅయ్యారు. భారత్-జపాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై చర్చించారు. జపాన్ మాజీ ప్రధానులు యోషిహిదే నుగా, ఫ్యూమియో కిషిడాలతో మోడీ సమావేశమమయ్యారు. టోక్యోలోని ప్రవాస భారతీయులను మోడీ కలుసుకున్నారు. ప్రవాస భారతీయుల ఆప్యాయత ఎంతోగానో కదలించిందని, జపాన్ సమాజానికి తోడ్పడుతూనే భారత సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడంలో ప్రవాస భారతీయుల నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు.
జపాన్ ప్రధానితో శిఖరాగ్ర సమావేశం
ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో మోడీ శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశంపై చర్చలు జరిగాయని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే లక్ష్యంతోనూ ఈ చర్చలు జరిగాయి. ఈ శిఖరాగ్ర సమావేశం భారత్-జపాన్ మధ్య 15వ శిఖరాగ్ర సమావేశం. 2005లో తొలిసారిగా న్యూఢిల్లీలో అప్పటి ఇరుదేశాల ప్రధానలు మన్మోహన్ సింగ్- జునిచిరో కోయిజుమి మధ్య మొదటి వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది.
ప్రపంచ శాంతి, స్థిరత్వమే ముఖ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES