- Advertisement -
నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్
మండల కేంద్రంలోని శివాలయంలో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ యువజన వారోత్సవాల పోస్టర్ ను సోమవారం పోలీస్ స్టేషన్ యందు ఎస్సై బి. సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవధూత రామకృష్ణ స్వామి, ధర్మ ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని వేల్పుర్ శివాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశభక్తిని పెంపొందిస్తూ యువశక్తితో ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఈ సత్కార్యంలో శివాలయం కమిటీ చైర్మన్ పన్నాల రాజేశ్వర్ రెడ్డి, సలహాదారుడు బొంపల్లి గంగాధర్ గుప్తా, రామ్మోహన్, పాకాల దశాగౌడ్, వడ్నాల రమేశ్, పత్తి రాజ్ కుమార్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



