ప్రముఖ సినీ రచయిత, చిత్రకారుడు కోడూరి శివశక్తి దత్తా (92) సోమ వారం రాత్రి కన్నుమూశారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు కళల మీద మక్కువ ఎక్కువ. తన ఇష్టాన్ని కాదన్నారని ఇంటర్‌లోనే చదువు ఆపేసి, ఇంటి నుంచి పారిపోయి ముంబయి వెళ్ళి పోయారు. అక్కడ సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో చేరి, డిప్లమా పూర్తి చేశారు. ‘కమలేష్’ కుంచె పేరుతో పెయింటింగ్స్ వేశారు. సంగీతంపై కూడా ఆసక్తి ఉండటం తో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. సంగీతంపై తనకి ఉన్న ప్రేమకు గుర్తుగా ‘కీరవాణి’ రాగాన్ని తన తనయుడుకి పేరుగా పెట్టారు.
అంతేకాదు సినిమాల మీద మక్కువతో మద్రాస్ వెళ్ళి, ఎల్వీప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేరారు. కె.రాఘవేంద్రరావు ‘జానకి రాముడు’ (1988)తో ఆయనకు రచయితగా తొలి అవకాశం లభించింది. ఆ సినిమా విశేష ప్రేక్షకా దరణ పొందింది. ఆ తర్వాత ‘సై’, ‘ఛత్రపతి’, ‘హనుమంతు’, ‘రాజన్న’, ‘షిర్డి సాయి’, ‘బహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘హను-మాన్’ వంటి తదితర చిత్రాల్లో ఆయన రాసిన పాటలు అందర్నీ విశేషంగా అలరించాయి. ముఖ్యంగా ‘బాహుబలి’లోని ‘మమతల తల్లి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని రామ రాఘవమ్..వంటి పాటలు విశేష శ్రోతకాదరణ పొందాయి.
కథ, గీత రచయితగా రాణిస్తూనే ‘అర్థాంగి’ ‘చంద్రహాస్’, చిత్రాలకు దర్శకత్వం వహించిన శివశక్తి దత్తా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణకి నాన్న, అలాగే దర్శకుడు రాజమౌళికి పెద్దనాన్న. బహుముఖ ప్రజ్ఞాశాలి శివశక్తి దత్తా మరణం పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
రచయిత శివశక్తి దత్తా ఇకలేరు
- Advertisement -
- Advertisement -