Sunday, July 13, 2025
E-PAPER
Homeబీజినెస్ఎక్స్‌ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధర తగ్గింపు

ఎక్స్‌ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధర తగ్గింపు

- Advertisement -

న్యూఢిల్లీ : ఎలన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ భారత్‌లోని వినియోగదారులకు ప్రీమియం సేవలపై తగ్గింపును అందిస్తున్నట్టు తెలిపింది. దేశంలో ఎక్కువ మంది యూజర్లకు చేరువయ్యేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా 48 శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకు నెలకు రూ.900 వసూలు చేయగా.. దానిని రూ.470కి తగ్గించింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్న వినియోగదారులు బ్లూటిక్‌ పొందడం సహ సుదీర్ఘ్ఘ పోస్టులు చేసుకోవడానికి వీలు కల్పిస్తోన్నట్టు పేర్కొంది. అదే విధంగా వెబ్‌ మోడ్‌లో ఎక్స్‌ను వినియోగించే వారికి నెల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరను రూ.650 నుంచి రూ.427కి తగ్గించింది. నెలవారీ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలను రూ.244 నుంచి రూ.170కి తగ్గించింది. బేసిక్‌ వినియోగదారుల వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లను కూడా రూ.2,590 నుంచి రూ.1,700 తగ్గించినట్టు ఎక్స్‌ వెల్లడించింది. తన ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎక్స్‌ 2023 అక్టోబర్‌లో తొలిసారి ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -