కన్న ఊరు లాగే యాదాద్రి భువనగిరి జిల్లాను మర్చిపోలేను..
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తియుక్తుల కృషి చేశా..
వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్ హనుమంతరావు.
జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా కలెక్టర్ గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ఇచ్చిందని కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని పూర్వ కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పూర్వ కలెక్టర్ హనుమంతరావు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ హనుమంతరావు ను ఘనంగా సత్కరించారు.
ఒక సంవత్సరం నాలుగు నెలలపాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు ,కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, ఆర్డీఓ లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జెడ్పీ సి.ఈ.ఓ శోభ రాణి, డి.ఆర్.ఓ జయమ్మ, తెలంగాణ గెజిటెడ్ అసోసియేటెడ్ ఉపేందర్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ నాగి రెడ్డి, అన్ని విభాగాల జిల్లా అధికారులు, సిబ్బంది, టీఎన్జీవో టీజీవో సంఘాల ప్రతినిధులు ఎంపీడీవోలు తహసీల్దారులు , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



