- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ 18వ వార్షిక మహాసభ కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభకు కాటారం డివిజన్ లోని అన్ని మండలాల్లో నుంచి యాదవ సంఘాల నాయకులు గురువారం కరీంనగర్ ఇందిరా గార్డెన్ పద్మనగర్ కు అధిక సంఖ్యలోతరలి వెళ్లారు. మండలంలోని గొర్రెలు, మేకల పెంపకం దారులు సంఘం నాయకులు యాదoడ్ల రామన్న యాదవ్, గడ్డం చంద్రయ్య యాదవ్, కొడారి చిన్న మల్లయ్య యాదవ్, బోయిని రాజయ్య యాదవ్, పర్షవేన బాపు యాదవ్, యాదండ్ల గట్టయ్య యాదవ్ తరలివెళ్లారు.
- Advertisement -