- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటి యమునా నది ప్రవాహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఢిల్లీ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలోని యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ వద్ద యమునా నది వరద నీరు తాగింది. ఈ వరద ప్రవాహాం క్రమేణా పెరిగే ప్రమాదం పొంచి ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు మెట్రోకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య యమునా నది నీటి మట్టం 207.48 మీటర్లుకు చేరుకుంది. అయితే, రాజధానిలో వర్షాలు తగ్గినప్పటికి యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తూనే ఉంది.

- Advertisement -