- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కమిటి సమావేశంలో యాటల అనిల్ కుమార్ కుమార్ ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత తెలిపారు. మార్క్సిజం- అంబేడ్కరిజం ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తున్న (బహుజన కమ్యూనిస్టు) పార్టీ బిఎల్ పి ని నిజామాబాద్ జిల్లాలో బలోపేతానికి కృషి చేస్తారని సబ్బన లత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు రాధా, బి. జగదీష్, సయ్యద్,మిగత జిల్లా కమిటి సభ్యులు లు పాల్గొన్నారు.
- Advertisement -